బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ షాక్.. పెరిగిన ధరలు

 

 

దేశీయంగా ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ధరలు తాజాగా పెరిగాయి. ఆదివారం బులియన్ మార్కెట్లో.. 10 గ్రాముల బంగారంపై రూ.290 మేర ధర పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 గా ఉంది. విజయవాడలోనూ సేమ్ ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150గా ఉంది.

 

పసిడి బాటలోనే వెండి ధరలు

ఆదివారం పసిడి బాటలోనే వెండి ధరలు పయనించాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.700 మేర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200 లుగా కొనసాగుతుండగా.. విజయవాడలో వెండి ధర రూ. 68,200గా ఉంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,200, ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,200, చెన్నైలో రూ. 68,200, బెంగళూరులో రూ. 63,200, కోల్‌కతాలో రూ.63,200గా కొనసాగుతోంది.