హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు భారీగా ఓట్లు

Huge-votes-for-Independents

Huge-votes-for-Independents

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్లు ప్రభావం చూపకపోయినా.. ఉప ఎన్నికల్లో మాత్రం వారికి భారీగా ఓట్లు పడ్డాయి. వీరికి ఈసీ కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీలైన కారు, కమలం పువ్వును పోలినట్టు ఉండటమే కారణమని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు నోటాకు పడ్డాయి.

వజ్రం(కమలం గుర్తులా..): ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు.

రోటీమేకర్‌ (కారును గుర్తులా..): ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్‌ 1,913తో ఐదోస్థానంలో నిలిచారు.

ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచాడు.