భర్త, మొదటి భార్యతో గోడవ పడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెండో భార్య - TNews Telugu

భర్త, మొదటి భార్యతో గోడవ పడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెండో భార్యwoman committed suicide out of fear that her husband infected with black fungus

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మందిపాల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రెండవ భార్య శిరీష (25) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మొదటి భర్య సుజాతతో విభేదాలతో సంవత్సరం క్రితం విడిగా ఉన్న భర్త గోపాల్ (షాద్ నగర్ పోలీస్టేషన్ లో పనిచేస్తున్న హోమ్ గార్డు ).. మొదటి భార్య ఇకరాదని గుట్టు చప్పుడు కాకుండా శిరీషను రెండవ పెళ్లి చేసుకున్నాడు.

రెండవ పెండ్లి విషయం తెలుసుకుని మొదటి భార్య సుజాత తిరిగి వచ్చింది. మొదటి భార్య రావడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి.. రెండవ భార్యను శిరీష ను భర్త గోపాల్ తిరిగి పంపించాడు.

పెద్దల సమక్షంలో ఒప్పుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో శిరీష తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. భర్త గోపాల్ తో మొదటి భార్య సుజాత తో గోడవ పడి ఇంట్లో ఉరివేసుకుని శిరీష ఆత్మహత్య చేసుకుంది.