ముగిసిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచార గడువు.. ఈ నెల 30న పోలింగ్

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఈనెల 30 న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కోవిడ్ పేషేంట్ లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పించారు. ఓటర్లందరూ కోవిడ్ నిబంధనలు పాటించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని ఎన్నికల సంఘం సూచించింది.

హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్ వారు హుజురాబాద్ నియోజకవర్గం వదిలి వెళ్ళిపొవాలన్నారు. నిషేద ఆంజ్ఞలు ఎవ్వరు ఉల్లంఘించిన‌ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 29వ రోజు ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నారు. ఈవీఎంలను కరీంనగర్ SRR కళాశాలలో భద్రపరుస్తామన్నారు. 2వ తేదిన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు అధికారులను నియమించనున్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు.

హుజురాబాద్ ఎన్నికల అప్డేట్

మొత్తం పోలింగ్ కేంద్రాలు.. 306

612 ఈవీఎంలు (అందుబాటులో 279 ఈవీఎంలు)

306 వివి ఫ్యాట్ (అందుబాటులో 209 వివి ఫ్యాట్ లు)

1000 కంటే ఎక్కువ ఓటర్లు  ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య.. 47

ఓటర్ల సంఖ్య.. 2,36,859

పురుష ఓటర్లు.. 1,17,768

మహిళ ఓటర్లు.. 1,19090

ట్రాన్స్ జెండర్.. 1

ఎన్ ఆర్ ఐ ఓటర్లు.. 14

సర్వీస్ ఓటర్లు.. 149

పి డబ్ల్యు ఓటర్లు.. 8246

18-19 ఏండ్ల ఓటర్లు.. 5165

80 ఆపై వయస్సు ఓటర్లు.. 4,454

మొత్తం ఓటర్లు.. 236859

సెంట్రల్ పోలీస్ పోర్స్..  1520

రాష్ట్ర పోలీస్ సిబ్బంది.. 2345

ఎన్నికల నిర్వహణలో మొత్తము పోలీస్ సిబ్బంది.. 3865