మా ఇంటికి రాకండి.. మా ఓటు వారికే.. హుజురాబాద్ లో ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టిన ఓటర్లు

huzurabad voters Arrange Flexis In Front Of Gates
huzurabad voters Arrange Flexis In Front Of Gates

ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్ది హుజురాబాద్ లో రాజకీయం, ప్రచార హోరు వేడెక్కుతోంది. ఇప్పటికే అన్నీ పార్టీల నుంచి నామినేషన్లు పూర్తయ్యాయి. కాగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం రోజూ జనాల ఇంటికి వెళ్తూ ప్రచారంలో మునిగిపోయారు పలు పార్టీల అభ్యర్థులు, వారి వారి అనుచరులు. అయితే.. రోజూ ప్రచారం అంటూ తీరిక లేకుండా చేస్తున్న నాయకులకు హుజురాబాద్ ఓటర్లు నోరు తెరిచి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా ఫ్లెక్సీలు కొట్టించి పెడుతారు.

huzurabad voters Arrange Flexis In Front Of Gates
huzurabad voters Arrange Flexis In Front Of Gates

మా ఇంటికి రాకండి..
ఒకవైపు అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎన్నికల్లో, ప్రచారంలో, ఓట్ల వేటలో దూసుకుపోవాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి గెల్లుశ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ నామినేషన్ వేసి పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు ప్రజలు ఏకంగా మా ఇంటికి ఓట్ల కోసం రాకండి. మా ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే. రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న వారికి కాకుండా మీకు ఓటేస్తామని ఎలా అనుకుంటున్నారు అంటూ ఇళ్ల ముందు ఫ్లెక్సీలు కట్టి.. మీకు ఓటెయ్యము అని బీజేపీ అభ్యర్థికి ఈటలకు చెప్పకనే చెప్పేస్తున్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో వెలుస్తున్న ఈ బోర్డులు ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని పలుచోట్ల ప్రజలు బోర్డులు పెడుతున్నారు.

huzurabad voters Arrange Flexis In Front Of Gates
huzurabad voters Arrange Flexis In Front Of Gates

ఇంటిముందు ఫ్లెక్సీలు..
హుజూరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా బీజేపీ అభ్యర్థులకు ఓటర్ల ఇళ్ల ముందు ఫ్లెక్సీలు షాక్ ఇస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలో ఇలా రాసి ఉంది. వంట నూనె, గ్యాస్ ధర, పెట్రోల్ ధరలు పెంచారు. మా ఇంటి ఓట్లు అడగడానికి బిజెపి పార్టీ వాళ్ళు రావొద్దు. ఆసరా పింఛన్లు , కళ్యాణ లక్ష్మి , రైతు రుణమాఫీ,ఇస్తున్న టిఆర్ఎస్ పార్టీకె మా ఓట్లు అంటూ ప్లెక్సీ ఇంటి గేటు ముందు కట్టారు. అది చూసిన బీజేపీ అభ్యర్థులు షాక్ కు గుర‌వుతున్నారు.