కోహ్లి కూతురుపై అనుచిత వ్యాఖ్యలు.. హైదరాబాద్ టెకీ అరెస్టు.. ఓ జాతీయ పార్టీ సోషల్ మీడియా టీం మెంబర్..!

Virat Kohli comments about Second test And Team Changes
Virat Kohli comments about Second test And Team Changes

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తర్వాత జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లి కుమార్తెపై ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రామ్‌నగేశ్‌ అలిబత్తిని (23)ని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.  రామ్‌నగేశ్‌ అలిబత్తిని  గతంలో ఓ జాతీయ పార్టీ సోషల్ మీడియా టీంలో పనిచేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ సాఫ్ట్ వేర్‌.. గతంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌లో కూడా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ ట్వీట్ స్క్రీన్ షాట్లే వైరల్

టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24న పాక్‌ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌నగేశ్‌.. కోహ్లి తొమ్మిది నెలల కుమార్తెను రేప్‌ చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డారు. @ramanheist నుంచి వచ్చిన ఈ ట్వీట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Why Kohli Retires From T20 Captaincy For Team India

షమిని వదల్లేదు

వీటితోపాటు పేసర్‌ మహమ్మద్‌ షమి( పాక్ తో జరిగిన మ్యాచ్ లో 40 పరుగులు ఇచ్చాడు.)పైనా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా షమిని సమర్థిస్తూ.. కోహ్లీ ఆ ట్వీట్లను ఖండించి షమికి అండగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీపై కూడా ఆన్‌లైన్‌లో పలువురు దాడి చేయడం వివాదం అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం కోహ్లీకి మద్దతుగా ట్వీట్ చేశాడు.

పాక్ అభిమానిగా బిల్డప్

బెదిరింపు ట్వీట్ వచ్చిన అకౌంట్ పేరును ఆ తర్వాత @criccrazyygirl గా మార్చి పాకిస్థాన్ క్రికెట్ అభిమానిగా నమ్మించేందుకు ప్రయత్నించినట్టు బెదిరింపు ట్వీట్లను అనలైజ్ చేసిన BoomLive అనే సంస్థ తెలిపింది. ఆ ట్విట్టర్ అకౌంట్.. హైదరాబాద్ కు చెందిన తెలుగు మాట్లాడే వ్యక్తిదిగా గుర్తించి ముంబాయి పోలీసులకు వివరాలను చెప్పింది. దాంతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన ముంబాయి ప్రత్యేక టీం.. ఇరోజు హైదరాబాద్ లో అతన్ని అదుపులోకి తీసుకుంది.

virat-kohli-and-shami

సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్‌

కోహ్లి తొమ్మిది నెలల కుమార్తెను రేప్‌ చేస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకున్న దిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ).. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్రైమ్‌)కు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.