టిక్ టాక్ స్టార్.. నాన్నకు నివాళిగా.. హైదరాబాద్ నుంచి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేశాడు - TNews Telugu

టిక్ టాక్ స్టార్.. నాన్నకు నివాళిగా.. హైదరాబాద్ నుంచి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేశాడుHyderabad Young Man Complete Cycle Tour From Hyderabad To Kashmir For Spread Corona Awareness
Hyderabad Young Man Complete Cycle Tour From Hyderabad To Kashmir For Spread Corona Awareness

కశ్మీర్ లాంటి భూతల స్వర్గానికి వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే.. అక్కడికి వెళ్లాలంటే అదృష్టం ఉండాలి. తిరిగి రావాలంటే ఆయుష్షు గట్టిగుండాలి. బస్సులోనో, కారులోనో బయల్దేరితే.. కనీసం వారం రోజులు ప్రయాణిస్తే గానీ ఆ స్వర్గానికి చేరలేం. కానీ ఓ యువకుడు మాత్రం నాన్న మీద ప్రేమతో.. తండ్రికి నివాళి అర్పించాలన్న ఆలోచనతో హైదరాబాద్ నుంచి కశ్మీర్ వరకు 3500 కి.మీ సైకిల్ యాత్ర చేశాడు. అంతే కాదు.. ఆ యాత్ర పొడవునా కరోనా మీద అవగాహన కల్పిస్తూ రోజుల తరబడి ఒంటరిగా సైకిల్ తొక్కుతూ కశ్మీర్ వరకు వెళ్లి వచ్చాడు. ఆ యువకుడి పేరే రంజిత్.

Hyderabad Young Man Complete Cycle Tour From Hyderabad To Kashmir For Spread Corona Awareness
Hyderabad Young Man Complete Cycle Tour From Hyderabad To Kashmir For Spread Corona Awareness

కరోనా వల్ల చనిపోయిన తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రపజలందరికీ కరోనా మీద అవగాహన కల్పిస్తూ తాను చేపట్టిన యాత్రకు రంజిత్ ఆన్ వీల్స్ అంటూ యాత్రా విశేషాలు, అనుభవాలు పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి కరోనా కాటుకు బలైతే.. ఆ బాధ భరించలేక డిప్రెషన్ లోకి వెళ్లిన రంజిత్.. అందులోంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. తన తండ్రి మరణించినట్టుగా కరోనా కాటుకు బలవుతున్న ఎంతోమందికి అవగాహన కల్పించాలనుకున్నాడు. నాన్న మృతికి నివాళిగా సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. కరోనా మీద అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ లో మొదలైన రంజిత్ సైకిల్ యాత్ర తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఇలా 14 రాష్ట్రాలకు దాటుతూ.. ఏకంగా 38 రోజుల పాటు ఆగకుండా సైకిల్ తొక్కిచివరికి కశ్మీర్ చేరింది. కరోనా మీద అవగాహన కల్పిస్తూ.. తండ్రికి నివాళి అర్పిస్తూ యాత్ర చేస్తున్న రంజిత్ కి ఇతర రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. కొందరు ఉచితంగా వసతి కల్పిస్తే.. మరికొందరు భోజనం పెట్టారు. మంచిచెడు చూసుకున్నారు. ఒక మంచి కార్యక్రమం కోసం ఏ పని మొదలుపెట్టినా ప్రపంచం మనకు సహకరిస్తుందనే నిజం మరోసారి నిజమైంది.

Hyderabad Young Man Complete Cycle Tour From Hyderabad To Kashmir For Spread Corona Awareness
Hyderabad Young Man Complete Cycle Tour From Hyderabad To Kashmir For Spread Corona Awareness

ఎలాంటి రోడ్ మ్యాప్ లేకుండానే సైకిల్ యాత్ర మొదలుపెట్టిన రంజిత్.. ఎలాంటి గైడెన్స్ లేకుండానే యాత్ర కొనసాగించాడు. కొవిడ్ పట్ల అవగాహన కల్పిస్తూ సాగిపోయాడు. ఈ క్రమంలో స్థానికులు పంచిన ప్రేమ, మార్గమధ్యంలో సోనూసూద్ ఇచ్చిన ఉత్సాహం రంజిత్ లో పట్టుదలను పెంచింది. కర్ణాటకలో జరుగుతున్న ఐపీఎస్ ల శిక్షణ శిబిరానికి స్పెషల్ గెస్ట్ గా పిలిచి తనతో మోటివేషన్ స్పీచ్ ఇప్పించారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తన యాత్ర దిగ్విజయంగా పూర్తి కావడానికి కారణం అంటున్నాడు రంజిత్. దాదాపు 3,500 కి.మీ మేర యాత్ర చేసిన రంజిత్ ను ఎంతోమంది పెద్దలు, ప్రముఖులు అభినందించారు. పలు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సైక్లిస్టులు గౌరవ సత్కారాలు చేశారు. హన్మకొండ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరంగల్ సీపీ డా.తరుణ్ జోషీ, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ రంజిత్ ను ప్రత్యేకంగా అభినందించి.. ఘనంగా సత్కరించారు.