వామ్మో.. ఇదేం కామెడీ గురు.. మంచు విష్ణు పరువు తీసిన హైపర్ ఆది.. మరి మంచు వర్గం ఊరుకుంటుందా ?

Hyper Aadi Makes Fun Of Manchu Vishnu Trolls In Maa Elections
Hyper Aadi Makes Fun Of Manchu Vishnu Trolls In Maa Elections
Hyper Aadi Makes Fun Of Manchu Vishnu Trolls In Maa Elections
Hyper Aadi Makes Fun Of Manchu Vishnu Trolls In Maa Elections

మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు చేసిన హడావిడి మాములుగా ఉండదు. అదేదో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలెక్షన్స్ అన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విష్ణు ఆవేశంతో ఊగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు ప్రెస్ మీట్స్ అన్నింటిలో అంకుల్ అనే పదం బాగా హైలైట్ అయ్యింది. ఒక సందర్భంలో మంచు విష్ణు ప్రెస్ మీట్ లో రాజశేఖర్ గురించి మాట్లాడుతుంటే.. పక్కనున్న సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ వద్దు అన్నట్టు విష్ణు చెయ్యి పట్టుకుని వారించే ప్రయత్నం చేస్తాడు.. దాంతో ‘ఆపొద్దు లెట్ దెం నో అంకుల్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నెట్ లో కుప్పలు తెప్పలుగా కామెడీ మీమ్స్ చేశారు. ఇక టంగుటూరి వీరేహం పకహం అంటూ ఏదేదో మాట్లాడేశాడు విష్ణు. ఇలా మంచు విష్ణు నాడు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌లపై తాజాగా హైపర్ ఆది సెటైర్లు వేశాడు.

యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా దీపావళి సందర్భంగా ‘తగ్గేదే లే’ అంటూ స్పెషల్ ఎంటటైన్మెంట్ ప్రోగ్రాం చేశారు. రోజా, ఇంద్రజ, ప్రియమణి, మన్నారా చోప్రాలతో చేసిన ఈ ఈవెంట్ లో హైపర్ ఆది స్కిట్ హైలైట్ అయ్యింది. ఈ స్కిట్ లోనే మంచు విష్ణుపై అద్దిరిపోయే పంచులతో రెచ్చిపోయాడు హైపర్ ఆది. అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడుతారేంటి? ఇంతకు ముందు ప్రియమణి గారు మా సైడ్ వచ్చి ఏమన్నారంటే.. అని ఆది అనడం.. హా ఏమన్నారు అని రోజా కౌంటర్ వేయడం.. ఆదిని రాం ప్రసాద్ అందరూ పట్టుకుని ఉంటే.. లెట్ దెమ్ నో అంకుల్ లెట్ దెమ్ నో.. అంటూ మంచు విష్ణును గుర్తుకు చేశాడు. స్కిట్‌లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది.. అసలు మీకు స్కిట్ గురించి తెలుసా? మీకు స్క్రిప్ట్ మీద శూన్యం.. ఆ గుడివాడ రహల గురించి తెలుసా? అంటూ అచ్చం మంచు విష్ణుని ఇమిటేట్ చేస్తూ కౌంటర్స్ వేశాడు హైపర్ ఆది. మరి ఆది చేసిన ఈ ఇమిటేషన్ కి మంచు వర్గం నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మా ఎన్నికల సమయంలో కొట్టి, తిట్టి, బెదిరించి మరి ఓట్లు వేయించుకున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి హైపర్ ఆది స్కిట్ ని మంచు వర్గం లైట్ తీసుకుంటారో.. లేక మ్యాటర్ సీరియస్ అవుతుందో వేచిచూడాలి.

https://www.youtube.com/watch?v=0uIvHaXam30