ప్రభాస్, రజినీకాంత్ సినిమాల టీజర్లను మించి ప్రపంచాన్ని ఊపేస్తున్న ప్రోమో.. మీరూ చూస్తారా?

రెండు రోజుల క్రితం విడుదలైన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ టీజర్, సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న టీజర్లు సినీ ఇండస్ట్రీని, సోషల్ మీడియాని ఊపేశాయి. కాగా.. ఈరోజు రిలీజ్ అయిన ఓ ప్రోమో మాత్రం ఏకంగా ప్రపంచాన్నే ఊపేస్తుంది. ఇప్పటిదాకా రాధేశ్యామ్ ట్రైలర్‌ను 52 మిలియన్లు, పెద్దన్న టీజర్ 10 మిలియన్లను దాటింది. ఆ రెండు వీడియోల షేకింగ్ కంటిన్యూ అవుతుండగానే మరో బ్లాక్ బాస్టర్ ప్రోమో ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తూ.. అందరి ఆసక్తిని గెలుచుకుంది. భాషకు, ప్రాంతానికి, దేశానికి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల ప్రజలను, క్రీడా ప్రేమికులను ఆ వీడియో రెప్ప వాల్చనీయకుండా చేసింది.

ICC Released india vs pakisthan Match Promo
ICC Released india vs pakisthan Match Promo

ఈరోజు సాయంత్రం 7:30కు స్టార్ట్ కానున్న భారత్ – పాకిస్తాన్ ల మధ్య జరుగనున్న టీ20 మ్యాచ్ కి సంబంధించిన ప్రోమో ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఐసీసీ రూపొందించిన 58 సెకన్ల పాటు ఉండే ఈ ప్రోమో భారత్ – పాక్ ల మ్యాచ్ కోసం ఈ వీడియోను ప్రత్యేకంగా రూపొందించారంటే మ్యాచ్ ప్రాధాన్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోమోలో ఐసీసీ వినియోగించిన పదాలు మ్యాచ్ తీవ్రత ఎలా ఉండబోతోందో చెప్తోంది. టు డే ఈజ్ ద బిగ్ డే అనే టైటిల్‌తో మొదలైన ఈ ప్రోమో.. ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఇండియా.. పాకిస్తాన్.. అంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంటే.. రెండు జట్ల బౌలింగ్, బ్యాటింగ్, రివల్రీ, ప్యాషన్, ప్రెషర్ అనే పదాలు పవర్ ఫుల్ బేస్ తో వినిపిస్తూ.. చివరికి ది వరల్డ్ ఈజ్ వాచింగ్ అనే పదాలతో ముగిసిన ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి.

అసలు భారత్ – పాక్ మ్యాచ్ అంటేనే నరాలు తెగేంత ఉత్కంఠ ఉంటుంది. దీనికి తోడు.. ప్రేక్షకుల హర్షధ్వానాలు, రెండు దేశాల నేతలు సైతం టీవీల ముందు, స్టేడియంలో కూర్చుని మ్యాచ్ తిలకిస్తారు. ఈ నేపథ్యంలో ఐసీసీ రూపొందించిన పాత మ్యాచ్ ల ప్రోమోలో క్యాచ్ లు, భారీ షాట్లు, అదిరిపోయే డెలివరీలు, వికెట్లు గాల్లో ఎగరడం వంటి షాట్లు మ్యాచ్ మీద ఆసక్తిని పెంచుతున్నాయి. సాయంత్రం 7:30కి ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా వీడియో రూపొందించి ఉదయమే విడుదల చేసి.. మ్యాచ్ మీద మరింత ఆసక్తిని పెంచింది.