కల్తీ నూనెలను గుర్తించండిలా.. - TNews Telugu

కల్తీ నూనెలను గుర్తించండిలా..ఓవైపు వంట నూనెల ధరలు మండిపోతుంటే మరోవైపు కల్తీ నూనెల బెడద జనాలను వేధిస్తోంది. కల్తీ నూనెలు తయారుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు.

వంట నూనెల కల్తీ వల్ల మనకు తెలియకుండానే అనేక రోగాలు అంటుకున్నాయి. అయితే మనం కొనే నూనె స్వచ్ఛమైనదా? లేక కల్తీదా? తెలుసుకోవడం ఎలా.. ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ వీడియోను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

వంటనూనెలో ప్రధానంగా ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారు. ఇది ఓ రకమైన పెస్టిసైడ్‌. ఇందులో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా నాడీవ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కొన్ని సందర్భాల్లో పక్షవాతంతోపాటు అనేక రోగాలు ఇది మూలమట.

ఇంట్లో వాడే నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ గుర్తించడం సులువు. ముందుగా రెండు మిల్లీ లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకోండి. వాటిల్లో పసుపు రంగులో ఉన్న వెన్నను వేయాలి. కాసేపాగి చూస్తే పాత్రలోని నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైన నూనె. రంగు మారి ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ అయినట్లు అర్థం.