ఈ లక్షణాలుంటే లో బీపీ ఉన్నట్లే. జర జాగ్రత్త.

ఉదయం లేవగానే మీకు బద్దకంగా ఉన్నట్లు అనిపిస్తుందా? అలసటగా ఉంటోందా? కళ్లు తిరిగినట్లు, తలతిరుగున్నట్లు గా ఉంటుందా ? వికారంగా, ఎప్పుడూ తలనొప్పి ఫీలింగ్ కలుగుతుందా ? అయితే మీకు మీకు లో బీపీ ఉన్నట్లే. అవును లో బీపీ ప్రధాన లక్షణాల్లో ఇవి కూడా కొన్ని. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి. లో బీపీ ఉన్నట్టయితే వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలి. ఐతే లో బీపీని ఎందుకు వస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

లో బీపీ ఎందుకు వస్తుంది?

నిజానికి చాలా మందికి హై బీపీ ఉంటుంది. దాని మీద ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ లో బీపీ కూడా పెద్ద సమస్యే. దీని మీద జరగాల్సినంత చర్చ అయితే జరగటం లేదు.ఈ కారణంగానే ఎంతో మందికి లో బీపీ ఉన్నప్పటికీ వారికి ఆ విషయం తెలియటం లేదు. ఐతే లో బీపీని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

లో బీపీ ఉందంటే…శరీరంలో కావాల్సినంత రక్త లేనట్లు. అలాంటి వారంతా ముందుగా ఎక్కువగా నీళ్లు తాగాలి. రక్తం పెరిగే వస్తువులను తినటం మంచిది. ఇక టెన్షన్స్ ఉంటే బీపీ పెగటమే కాదు. తగ్గటం కూడా జరుగుతుంది. అందువల్ల ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇక రోజు వాకింగ్ లేదా ఎక్సర్ సైజ్ చేయటం ద్వారా లో బీపీ సమస్య నుంచి బయటపడవచ్చు.

విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి

విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా బీ12, విటమిన్ ఈ ఉన్న ఆహారం తీసుకోవాలి. విటమిన్ బీ 12 తీసుకుంటే బీపీని పెంచటానికి ఉపయోగపడుతుంది. స్వీట్ పొటాటో, పాలు, చీజ్, చేపలు, బాదంపప్పు, గుడ్లు తినాలి. విటమిన్స్ ఫుడ్ అంతా తీసుకోలేకపోతే డాక్టర్ ను అడిగి విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు.

ఉప్పునీళ్లు, కాఫీ, గ్రీన్ టీ

ఉప్పునీరు కూడా బీపీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. గ్లాసెడు నీళ్లు, అర టీ స్పూన్ ఉప్పు కలపాలి. బీపీ తగ్గినట్లు అనిపిస్తే ఈ నీటిని తాగాలి. కాఫీ కూడా లో బీపీ ఉన్న వారికి మంచి ఔషధమే. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తీసుకోవాలి. ఇందులో ఉండే కెఫిన్…బీపీ పెంచేందుకు ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ కూడా మంచి ఛాయిసే. రోజుకు రెండు నుంచి మూడు సార్లు గ్రీన్ తీసుకోవాలి.

​రోజ్ మేరీ ఆయిల్

లో బీపీ  తగ్గాలంటే రోజ్ మేరీ నూనెను వాడవచ్చు. రోజు ఆరు చుక్కల నూనెను వాడుతూ ఒళ్లంతా మసాజ్ చేసుకోవాలి. రోజు ఇలా చేస్తే లో బీపీ సమస్య పోతుంది. రోజ్ మేరీ నూనెలో క‌ర్పూరం ఉంటది. ఇది శ్వాస వ్య‌వ‌స్థ‌ను బాగు చేస్తుంది.