అయోధ్యలో దుర్గా మండపం వద్ద కాల్పులు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - TNews Telugu

అయోధ్యలో దుర్గా మండపం వద్ద కాల్పులు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలుయూపీలోని అయోధ్యలో కాల్పులు కలకలం సృష్టించాయి. అయోధ్యలోని కోర్ఖానాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద బుధవారం రాత్రి వాహనాల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు మండపం వద్ద నిల్చున్న ఒకరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడిక్కడే మరణించగా.. మృతుడి కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని అయోధ్య జిల్లా దవాఖానాకు తరలించారు. బాలికలకు ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం లక్నో దవాఖానాకు తరలించారు.

Illegal Firing In ayodhya Durga Pandal
Illegal Firing In ayodhya Durga Pandal

కాల్పుల సమాచారం అందుకున్న అయోధ్య పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన నలుగురిలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుడి సమాచారం మేరకు.. మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. వ్యక్తిగత కక్షల వల్లనే కాల్పులు జరిగాయని.. పోలీసులు తెలిపారు.