బిట్ కాయిన్ కరెన్సీయే కాదు. దానికి చట్టబద్దత వద్దన్న ఐఎంఎఫ్

క్రిప్టోకరెన్సీ పై ప్రపంచ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ డిజిటల్ కరెన్సీని ఆమోదించాలని కొన్ని దేశాలు అంటుండగా…కొన్ని దేశాలు మాత్రం నో అంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎకానమిక్ ఎక్స్ పర్ట్ లు మాత్రం క్రిప్టో కరెన్సీ డేంజర్ అనే చెబుతున్నారు. ఈ కరెన్సీకి ఎలాంటి చట్టబద్దత లేకపోయినా కోట్లాది మంది ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ మన దేశంలోనే అత్యధికంగా 10 కోట్ల మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోను అఫిషియల్ కరెన్సీ గా గుర్తిస్తారని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఎక్కువ దేశాలు దీనిపై ఆసక్తి చూపటం లేదు. అలాంటిది ఎల్ సాల్వడర్ అనే స్మాల్ కంట్రీ మాత్రం క్రిప్టో విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. పదుల సంఖ్యలో క్రిప్టో బిట్ కాయిన్స్ ను తయారు చేస్తోంది. కానీ దూకుడు పై ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్ (IMF) నీళ్లు చల్లాంది.

అఫిషియల్ కరెన్సీగా గుర్తించొద్దు

బిట్ కాయిన్స్ భారీగా విడుదల చేసిన సాల్వడర్ ఇప్పటికే వాటికి చట్టబద్దత ఇచ్చేసింది. కానీ ఈ డిజిటల్ కరెన్సీ లో రిస్క్ ఎక్కువగా ఉందని ఐఎంఎఫ్ తేల్చి చెప్పింది. ఎట్టిపరిస్థితుల్లో చట్టబద్దత ఇవ్వొద్దని సూచించింది. ఇలాంటి వాటికి అనుమతిస్తే ఆర్థిక నేరాల సంఖ్య భారీగా పెరగవచ్చని..ఇందుకు బదులుగా కొత్త పేమెంట్స్ ను ఎంకరేజ్ చేయాలని సూచించింది.

బిట్ కాయిన్ బాండ్లు కూడా రిలీజ్

ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె బిట్ కాయిన్స్ విషయంలో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన బిట్ కాయిన్ బాండ్లతో బిట్ కాయిన్ సిటీ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన రెండు రోజుల్లోనే ఐఎంఎఫ్ ఇలా షాక్ ఇచ్చింది. దీంతో క్రిప్టో కరెన్సీ భవితవ్యం ఏంటన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.