జస్ట్​ ఒక్క నిమిషంలో ఇంటర్నెట్​ లో ఏం జరుగుతుందో తెలుసా?

జస్ట్ వన్ మినిట్​.. ఒకే ఒక నిమిషం మనం చాలా సింపుల్​ గా అనే మాట ఇది. ఒక్క నిమిషంలో వచ్చేస్తున్నా.. ఆ పని నాకు చిటికె వేసినంత విషయం.. ఒక్క నిమిషంలో పూర్తి చేసేస్తా.. ఇలాంటి డైలాగులు రెగ్యులర్ గా మనకు వినిపిస్తూనే ఉంటాయి. అంతెందుకు మనిషి ప్రాణం పోవాలన్నా..ఊపిరి నిలవాలన్నా ఒక్క నిమిషం చాలు. గెలుపోటములను నిర్ణయించే ఒక్క నిమిషంలో ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా చేసేసిన ఇంటర్నెట్​ లో ఒక్క నిమిషంలో ఏం జరుగుతున్నాయో ఓ లుక్కేద్దామా!

90వ దశకం తర్వాత ఇంటర్నెట్‌ వినియోగం వేగంగా పెరిగింది. చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఇంటర్నెట్‌ సేవలు.. ఇప్పుడు ప్రపంచాన్ని ఒక ఊరుగా మార్చేసి ఊరూరికి విస్తరించాయి. డబ్ల్యూఎఫ్‌ అంచనాల ప్రకారం 2020లో ఇంటర్నెట్ వినియోగదారులు 4.5 బిలియన్లు ఉండగా.. ఈ ఏడాది ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 11 శాతం పెరిగింది. ట్విట్టర్‌లో యూజర్లు నిమిషానికి 575,000 ట్వీట్‌లను పోస్ట్ చేస‍్తున్నారు.

 • ఒక్క నిమిషంలో టిక్ టాక్ లో 67 మిలియన్ల వీడియో క్లిప్పులను చూస్తున్నారు.
 • నిమిషానికి గూగుల్​ లో 5.7 మిలియన్ల మంది వివిధ సమాచారం కోసం సెర్చ్‌ చేస్తున్నారు.
 • ఐఫోన్, ఐపాడ్ లలో నిమిషానికి 12 మిలియన్ల మంది మెసేజ్‌లు పంపుతున్నారు.
 • ఇన్ స్టాగ్రామ్ లో నిమిషానికి 65వేల ఫొటోలు షేర్ అవుతున్నాయి.

 • ఫేస్ బుక్‌లో ప్రతి నిమిసం దాదాపు 2 లక్షల 40వేల ఫొటోలు షేర్ చేస్తున్నారు. ప్రతి నిమిషం 44 మిలియన్ల మంది ఫేస్ బుక్‌ చూస్తున్నారు.
 • ఒక్క నిమిషంలో 2లక్షల 83వేల డాలర్లను అమెజాన్ లో  కస్టమర్లు ఖర్చు పెడుతున్నారు.
 • నిమిషానికి 6 మిలియన్ల మంది ఆన్ లైన్ షాపింగల్ చేస్తున్నారు.
 • ఓటీటీ  ప్లాట్ ఫామ్​ నెట్​ ఫ్లిక్స్ లో న ఇమిషానికి 452 గంటల వీడియోలను చూస్తున్నారు.
 • అదే యూట్యూబ్‌లో అయితే నిమిషానికి 694 గంటల వీడియోలను చూస్తున్నారు.

 • నిమిషానికి స్నాప్ చాట్‌లో 2 మిలియన్ల స్నాప్స్ షేర్ చేస్తున్నారు.
 • జూమ్ లో ప్రతి నిమిషానికి 856 నిమిషాల వెబినార్లను హోస్ట్​ చేస్తుంది.
 • మైక్రోసాఫ్ట్ బృందాలు ప్రతి నిమిషం లక్షమంది వినియోగదారులను పొందుతోంది.

 • నిమిషానికి 950 కొత్త యూట్యూబ్ యూజర్లు కొత్తగా పరిచయమవుతున్నారు.
 • ప్రస్తుతం 5 బిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు.