తొలి 3 రోజుల్లో రైతుబంధు రూ. 1153.50 కోట్లు జ‌మ - TNews Telugu

తొలి 3 రోజుల్లో రైతుబంధు రూ. 1153.50 కోట్లు జ‌మరాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 42.43 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అయింది. తొలి మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ. 1153.50 కోట్లు జ‌మ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. రేపు మ‌రో 7.05 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి నగ‌దు జ‌మ చేయనున్నారు.

In the first 3 days under Raitubandhu Rs. 1153.50 crore deposit
In the first 3 days under Raitubandhu Rs. 1153.50 crore deposit

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

రేపు 58.85 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు రూ. 2,942.27 కోట్లు జ‌మ చేయనున్నారు. ఎక‌రానికి రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి ప్ర‌భుత్వం బ‌దిలీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంవ‌త్స‌రానికి రెండుసార్లు రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అవుతుంది.