భవిష్యత్తులో రైతు చట్టాలను మరో రూపంలో తీసుకురావచ్చు: మల్లికార్జున ఖర్గే

Mallikarjuna-Kharge

ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరుగుదల, రైతు సమస్యలు, కొవిడ్​-19.. తదితర అంశాలపై అఖిలపక్ష నేతలు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇవాల నిర్వహించి అఖిలపక్ష సమావేశంలో కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని అన్నిపార్టీలు డిమాండ్ చేశాయి.

కొవిడ్​-19 బాధిత కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ఇవ్వాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని ఈ సందర్భంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్​ చేశారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరవుతారని భావించామని, కానీ హాజరుకాలేదని ఆయన విమర్శించారు.

కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసింది.. రైతులకు అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామని ప్రధాని మోదీ అన్నారు. అంటే దీని అర్థం.. భవిష్యత్తులో మరో విధంగా రైతు చట్టాలను తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.