ఆశాఢమాసములో.. గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం ఇదే..!

గొరింటాకు అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు. అలంకరణ కోసం గోరింటాకును పెట్టుకుంటారు అతివలు. అయితే ఆశాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితి. సాక్ష్యాత్ పార్వతి దేవి రుధిరాంశంతో జన్మించిందే గోరింటాకు చెట్టు. అందుకే దీనికి గౌరి దేవి పేరు మీద గోరింటాకు అని పేరు వచ్చింది.

అయితే ఆశాడ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంధర్భంలో ఆశాడంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అయితే ఎండాకాలం వెళ్లిన తర్వాత వచ్చే ఆశాడ మాసంలో శరీరంలో వేడి తగ్గడానికి గోరింటాకును పెట్టుకుంటారు. అతి ఊష్ణాన్ని తొలగించి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మహిళల్లో వచ్చే గర్భస్త సమస్యలు రాకుండా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా చెట్టుకు కాసిన గోరింటాకు ఆకులను రుబ్బి చేతులకు పెట్టుకుంటే అలంకరణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.