రైతుబంధు సాయంతో పెరిగిన సాగు విస్తీర్ణం: మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy was angry that the AP government has not changed its stance.

Today rythu bandhu amount deposit in 7.05 lakh farmers account

రాష్ట్రంలో రైతుబంధు సాయంతో సాగు విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడే దీనికి నిదర్శనమన్నారు. ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని, తెలంగాణ ఆవిర్భావ సమయంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 29.26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం జరిగిందని మంత్రి వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని గోదాములతో పాటు రైతు వేదికలు, కాటన్ మిల్లులు, అవకాశం ఉన్న ప్రతిచోటా ధాన్యం నిలువచేయడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన  ప్రాధాన్యత మూలంగానే ఇది సాధ్యం అయిందని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి విమర్శలు చేసే విపక్షాలు ముందు ఇంత ఉత్పత్తి ఎలా సాధ్యమయిందో అర్ధం చేసుకుని మాట్లాడాలని సూచించారు. 2014 – 15 లో వానాకాలం, యాసంగి కలిపి 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కేవలం 2021 ఈ యాసంగి లోనే 90.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు.

54.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు

54.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5145.87 కోట్లు జమ చేసినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతుబంధు  ఐదవరోజు 4.90 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1050.10 కోట్లు జమ చేశామన్నారు. మొత్తం 102.92 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందిందన్నారు. అత్యధికంగా నల్లగొండలో ఇప్పటి వరకు 3,97,260 మంది రైతులకు రూ.401.92 కోట్లు పంపిణీ చేశామన్నారు.  అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 27,819 మంది రైతులకు రూ.19.68 కోట్లు జమ చేసినట్టు మంత్రి చెప్పారు. నల్గొండ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,35,549 మంది రైతులకు రూ.254.62 కోట్లు, మూడోస్థానంలో సంగారెడ్డి జిల్లా 2,66,797 మంది రైతులకు రూ.247.67 కోట్లు రైతు బంధు కింద జమ చేసినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.