భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు వన్డే సిరీస్ చివరి మ్యాచ్ జరుగుతోంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ నిర్వహించగా.. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తవగా రెండింటిలోనూ సౌతాఫ్రికా విజయం సాధించింది. దాంతో ఈ వన్డేలో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ కసి మీద ఉన్నది. అదే సమయంలో భారత్‌ను మూడో వన్డేలోనూ ఓడించి సిరీస్‌ను క్లీన్ స్వీస్ చేయాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతున్నది.
సౌతాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని కోరుకుంటూ చివరి మ్యాచులో బరిలోకి దిగనుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 288 పరుగుల విజయ లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో సులువుగా సాధించింది. మలాన్ దక్షిణాఫ్రికా తరఫున అత్యధికంగా 91 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ 78 పరుగులు చేసి భారత్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు.