జ‌న‌వ‌రి 23 నుంచే గ‌ణ‌తంత్ర వేడుక‌లు

Independence Day celebrations

ఈ ఏడాది గ‌ణ‌తంత్ర వేడుక‌లు నుంచి జ‌న‌వ‌రి 23 నుంచే ప్రారంభం కానున్నాయి. జ‌వ‌న‌రి 24న సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి పుర‌స్క‌రించుకొని ముందుగానే గ‌ణ‌తంత్ర వేడుక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతిని ప‌రాక్ర‌మ్ దివాస్‌గా జ‌రుపుకోనున్నారు. ఇప్ప‌టికే ఆగ‌స్టు 14న‌ దేశ విభ‌జ‌న సంస్మ‌ర‌ణ దినోత్స‌వంగానూ, అక్టోబ‌ర్ 31న స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతిని జాతీయ ఐక్య‌త దివాస్‌గా కేంద్రం నిర్వ‌హిస్తోన్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో 26న జ‌రిగే గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో కేవ‌లం 24 వేల మందికి అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. గ‌తేడాది కూడా 25 వేల మందికి అనుమతించారు. సాధారణంగా రిప‌బ్లిక్ వేడుక‌ల్లో సుమారు ల‌క్షా 25 వేల మంది వరకు పాల్గొంటారు.