దేశంలో భారీగా తగ్గిన కొత్త కేసులు.. 14,313 మందికి కరోనా పాజిటివ్ - TNews Telugu

దేశంలో భారీగా తగ్గిన కొత్త కేసులు.. 14,313 మందికి కరోనా పాజిటివ్India Records 14,313 New Covid Cases In A Day

దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఒక్కసారిగా 14 వేలకు దిగివచ్చిన కేసులు.. మార్చి ప్రారంభం నాటి స్థాయికి పడిపోయాయి. డిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,313 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 181 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత రోజువారిగా నమోదయ్యే కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కాగా.. కేరళలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న నిమోదైన కరోనా కేసులు, మరణాల్లో కేరళలో 6,996 కేసులు నమోదు కాగా.. 84 మంది మరణించారు.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,85,920 కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,50,963 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 26,579 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,33,20,057 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,14,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడు నెలల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో తగ్గాయి. ఇక క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా వేగంగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 95.89 కోట్ల మంది క‌రోనా టీకా తీసుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 65.86 ల‌క్ష‌ల మంది కొత్త‌గా టీకా తీసుకున్నారు.