దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు.. 226 మరణాలు - TNews Telugu

దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు.. 226 మరణాలుIndia reports 15,823 new Covid cases, 226 deaths in last 24 hours

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,823 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 226 మంది మరణించగా, 22,844 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతున్నది. ఇప్పటివరకు 96,43,79,212 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మంగళవారం ఒక్కరోజే 50,63,845 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, అక్టోబర్‌ 12 వరకు దేశవ్యాప్తంగా 58,63,63,442 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది. ఇందులో నిన్న ఒకేరోజు 13,25,399 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది.