స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

India reports 3.06 lakh daily new cases and 439 deaths

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసులు మూడు లక్షలకుపైగా నమోదువుతుండగా.. మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజూ మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం 14 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,06,064 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజు కంటే 27 వేల కేసులు తగ్గాయి. దీంతో మొత్తం కేసులు 3,95,43,328కి పెరిగాయి. ఇందులో 3,68,04,145 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 4,89,848 మంది మృతిచెందారు. మరో 22,49,335 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కాగా, గత 24 గంటల్లో కొత్తగా 439 మంది మరణించగా, 2,43,495 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం రికవరీలు 3.68 కోట్లు(93.07 శాతం)గా ఉన్నాయి. నిన్న సెలవు రోజు కావడంతో కేవలం 27 లక్షల మందికే టీకా అందింది. మొత్తంగా 162 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. కొద్ది రోజులుగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారికి మొదటి డోసు, ముప్పు పొంచి ఉన్న వర్గానికి ప్రికాషనరీ డోసు అందిస్తోన్న సంగతి తెలిసిందే.