ఫస్ట్ టెస్ట్ లోనే శతకొట్టిన శ్రేయస్… తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోర్ 345

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ సత్తా చాటింది. రెండు రోజుల ఆటలో 345 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ తోనే టెస్ట్ ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులతో శతకం నమోదు చేశాడు. రవీంద్ర జడేజా 50, రవిచంద్ర అశ్విన్ 38 పరుగులతో భారత్ మొత్తం 345 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో సౌథీ 5 వికెట్లు పడగొట్టగా, జేమిసన్3, అజాజ్ పటేల్ 2 వికెట్లు తీశారు.


టీమిండియా 258/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఆట ప్రారంభించిన టీమిండియా 87 పరుగులు జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు కేవలం ఒకే వికెట్ తీసిన సౌథీ.. రెండోరోజు నాలుగు వికెట్లు సాధించాడు. జడేజా, సాహా, అక్షర్ పటేల్ లను ఔట్ చేసి భారత భారీ స్కోరుకు బ్రేక్ వేశాడు. జేమిసన్‌ వేసిన 92వ ఓవర్‌లో శ్రేయస్‌ తొలి బంతికే రెండు పరుగులు తీసి టెస్టుల్లో తొలి శతకం నమోదు చేశాడు. భోజన విరామానికి ముందు అశ్విన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 339/8తో తొలి సెషన్‌ను ముగించింది. భోజన విరామం అనంతరం అజాజ్‌ పటేల్‌ అశ్విన్‌, ఇషాంత్‌(0)ను ఔట్‌ చేయడంతో భారత ఇన్నింగ్స్‌కు 345 పరుగుల వద్ద తెరపడింది.