ఇండియా 339/8.. సౌథీకి ఐదు వికెట్లు

కాన్పూర్ లో జరుగుతున్న న్యూజిలాండ్ తొలి టెస్టులో భారత బ్యాటర్లు సత్తా చాటారు. రెండో రోజు భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. తొలి టెస్టులోనే సెంచరీ కొట్టి ఇండియన్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులోనే 105 పరుగులు చేసిన అయ్యర్.. ఆరంగ్రేటం చేసిన టెస్టులోనే సెంచరీ చేసిన 16వ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.


లంచ్ బ్రేక్ కి ముందు వికెట్లు కుప్పకూలి ఆలౌట్ అవుతారేమో అనుకున్నప్పటికీ.. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగిన అశ్విన్ ఆదుకున్నాడు. 58 బంతుల్లో 38 పరుగులు చేసిన అశ్విన్ క్రీజులో ఉన్నాడు. 258 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా తొలి సెషన్ లో 81 పరుగులు జోడించింది. జడేజా 50 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో చెలరేగిన సౌథీ ఐదు వికెట్లు తీసుకోగా.. జేమిసన్ మూడు వికెట్లు పడగొట్టాడు.