ఈ ఒక్క కోహ్లీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతే చాలు.. పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఎవ్వరు ఆపలేరు.. ఆ సీక్రెట్ ఏంటంటే..!

India Vs Pakistan Match Virat Kohli Not Out Sentiment Against Pakistan
India Vs Pakistan Match Virat Kohli Not Out Sentiment Against Pakistan
India Vs Pakistan Match Virat Kohli Not Out Sentiment Against Pakistan
India Vs Pakistan Match Virat Kohli Not Out Sentiment Against Pakistan

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ పై అసాధారణ రికార్డ్ ఉంది. ఛేజింగ్ లో ఆసాధారణ రికార్డ్ ఉన్న విరాట్ ఆడిన చివరి మూడు టీ20 వరల్డ్‌కప్స్‌లో నాటౌట్ గా నిలిచాడు. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘనవిజయం సాధించింది. మరి ఈ రోజు కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. దాయాది పాకిస్తాన్ తో ఈ రోజు సాయంత్రం 7.30నిలకి ప్రారంబయ్యె ఈ సమరంలోను విరాట్ తన ట్రాక్ రికార్డ్ ని నిలుపుకుంటాడా.. ఇదే కనుక నిజమైతే పాకిస్తాన్ కి ఈ సారి భంగపాటు ఖాయమంటున్నారు. ఇప్పటికే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ని ఓడించటంలో భారత్ కి అమోఘమైన రికార్డ్ ఉంది. భారత్ పాకిస్తాన్ వరల్డ్ కప్ లో 12మ్యాచుల్లో తలపడగా అన్ని మ్యాచుల్లోనూ పాకిస్తాన్ ని మట్టికరిపించేసింది టీమిండియా. దాంతో ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్ర తిరగరాయాలని పగటి కళలు కంటుంది పాకిస్తాన్. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాకిస్థాన్‌పై ఇప్పటి వరకూ ఆరు టీ20 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ ఏకంగా 84.66 సగటుతో 254 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా పాక్‌పై అతని స్ట్రైక్‌రేట్ 118.69గా ఉండగా.. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అలానే అత్యధిక స్కోరు 78 పరుగులు. ఈ గణాంకాల కంటే.. ఎక్కువగా ఆసక్తిరేపుతున్న అంశం.. పాక్‌పై విరాట్ కోహ్లీ నాటౌట్‌గా నిలుస్తుండటమే. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ ఆఖరి వరకూ నాటౌట్‌గా నిలిచాడు. 2012 టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌పై 78 పరుగులు చేసిన కోహ్లీ.. 2014లో 36 పరుగులు, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో 55 పరుగులు చేశాడు విరాట్. అయితే ఆడిన ఈ మూడు మ్యాచుల్లోనూ పాకిస్తాన్ బౌలర్లు ఒక్కసారి కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేయకపోవటం గమనార్హం.

ఈ ఒక్క ఉదాహరణ చాలు పాకిస్తాన్ అంటేనే కోహ్లీ ఎంత కసిగా ఆడుతాడో. మళ్ళీ ఈ మ్యాచ్ లోను విరాట్ నాటౌట్ గా నిలుస్తే భారత్ గెలుపుని ఎవ్వరు ఆపాపలేరని సెంటిమెంట్ చెప్తుంది. ఇక పాక్ తో మ్యాచ్ అంటేనే కోహ్లీ లోని ఆటగాడు నూటికి నూరు శాతం బయటి కొచ్చేస్తాడు. గ్రౌండ్ లో కోహ్లీ బాడీలాంగ్వేజ్, హావా భావాలకే పాకిస్తాన్ ప్లేయర్స్ లో సగం దైర్యం చచ్చిపోతుందని.. కోహ్లీ పాకిస్తాన్ మ్యాచులో అంత ఆవేశంగా కనిపిస్తాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా ప్రస్తుత ఫార్మ్ ప్రకారం చూస్తే.. తమకు తాముగా నిర్లక్ష్యంతో ఆడి ఓడిపోవటమే కానీ.. పాకిస్తాన్ కి మాత్రం భారత్ పై గెలిచే అవకాశాలు చాల తక్కువ అంటున్నారు స్పోర్ట్స్ క్రిటిక్స్.