మన షణ్ముఖ ప్రియ ఓడినా.. కోట్లాది హృదయాలను ఎలా గెలుచుకుంది.. ఎందుకింత క్రేజ్..!

Indian Idol 12 Grand Finale: Shanmukha Priya Won Millions Of Hearts
Indian Idol 12 Grand Finale: Shanmukha Priya Won Millions Of Hearts
Indian Idol 12 Grand Finale: Shanmukha Priya Won Millions Of Hearts
Indian Idol 12 Grand Finale: Shanmukha Priya Won Millions Of Hearts

నంబర్ వన్ సింగింగ్ కాంపిటీషన్ షోగా ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కోట్లాది మంది వ్యూవర్ షిప్ ఉన్న ఈ షోని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా చూస్తారు. ఈ నేపథ్యంలో సోనీ టీవీ నిర్వహిస్తున్న ఈ ఇండియన్ ఐడల్ 12వ సీజన్‏ తో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పోటీపడింది. గ్రాండ్ ఫినాలే టాప్ 6కి ఎన్నికైన షణ్ముఖ ప్రియా నిన్న అట్టహాసంగా జరిగిన పైనల్‏లో ఓడిపోయినా కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకుంది. మూడేళ్ల వయసులో పాట మొదలుపెట్టిన షణ్ముఖ ప్రియ దాన్నే తన ఆటగా మార్చుకుంది. మెలోడీ, మాస్‌, క్లాస్‌… తేడా లేకుండా అన్ని వర్గాలనీ సుస్వరాలతో కట్టి పడేస్తుంది. అందుకే ఇండియన్‌ ఐడల్‌ వేదిక మీద ప్రశంసలతో పాటు అవకాశాలూ వెల్లువెత్తాయి.

శాస్త్రీయ సంగీతంతో పాటు పాప్, రాక్, వెస్టర్న్ వంటి ఎన్నో వెరైటీ గీతాలన్నింటిని అలవోకగా పాడుతూ షోలో వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్ గా పేరుతెచ్చుకుని ఫైనల్ టైటిల్ లో ఫెవరెట్ గా నిలిచింది షణ్ముఖ ప్రియ. అయితే గ్రాండ్ ఫినాలే కంటే ముందు హీరో విజయ్ దేవరకొండ షణ్ముఖతో వీడియో కాల్ లో సంభాషించాడు. తన సినిమాలో పాడే అవకాశమిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. షణ్ముఖకి బ్లెస్సింగ్స్ ఇస్తూ, బెస్ట్ విషెష్ చెప్తూ సర్ ప్రైజ్ చేసిన రౌడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విజయ్ ఇచ్చిన సర్ ప్రైజ్ కి షణ్ముఖ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విజయ్ దేవరకొండ తన ఫెవరెట్ హీరో అని.. అతని మూవీలో ఒక పాట పాడటం తన కోరిక అని షణ్ముఖ గతంలో ఒకసారి షో నిర్వాహకులకు తెలుపగా.. ఈ విషయాన్నీ విజయ్ కి చెప్పి షణ్ముఖకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని సోని టీవీ కోరగానే విజయ్ దేవరకొండ షణ్ముక ప్రియను సర్ ప్రైజ్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే నిన్న జరిగిన ఈ గ్రాండ్ ఫినాలే షోకి దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో టీఆర్పీఎస్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ఈ పాపులర్ మ్యూజిక్ షో సీజన్ 12 విజేతగా పవన్‌ దీప్ రాజన్ నిలిచారు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్‌, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్‌ దనిష్‌, ఐదో స్థానంలో నిహల్‌ నిలవగా.. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరవ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌కు ఆదిత్య నారాయణ్ హోస్ట్‌గా, హిమేశ్ రేష్మియా, అనుమాలిక్, సోను కక్కర్ జడ్జ్‌లుగా వ్యవహరించగా.. గెస్ట్ హోదాలో జావెద్ అలీ, సుఖ్విందర్ సింగ్, సాధన సర్గమ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, ఉదిత్ నారాయణ్, అల్కా యాజ్ఞిక్ హాజరయ్యారు.