థామస్ కప్‌లో ఫైనల్లోకి భారత్ పురుషుల బ్యాడ్మింటన్ జట్టు

Indian Men-Thomas Cup Final

బ్యాంకాక్‌లో జరుగుతున్న థామస్ కప్‌లో భారత్ సంచలనం సృష్టించింది. ఇండియన్ షట్లర్లు తమ సత్తా చాటి పతకం ఖాయం చేసుకున్నారు. నిన్న (శుక్రవారం) జరిగిన సెమీ ఫైనల్‌లో డెన్మార్క్‌ను 3-2తో ఓడించిన భారత జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకుంది. ఫలితంగా 43 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

1979 తర్వాత భారత జట్టు ఇప్పటి వరకు సెమీస్‌కు కూడా చేరలేదు. ఈసారి ఏకంగా ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈసారి కూడా హెచ్ఎస్ ప్రణయ్ మ్యాచ్ కీలకంగా మారింది. రాస్మస్ గెంకేను 13-21, 21-9, 21-12తో ప్రణయ్ చిత్తు చేశాడు. రేపు(ఆదివారం) జరగనున్న గోల్డ్ మెడల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్, 14సార్లు విజేత అయిన ఇండోనేషియాతో భారత్ తలపడనుంది.