హైదరాబాద్ వాసులకు గమనిక.. రెండ్రోజులపాటు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం!

Interruption of water supply for days in these areas of hyderabad

Interruption of water supply for days in these areas of hyderabad
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న గోదావరి పథకంలోని మల్లారం పంప్ హౌస్ లోకి భారీగా వరద నీరు చేరింది. దీనివల్ల రాగల 48 గంటల పాటు నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, పటాన్ చెరు, నిజాంపేట్, బాచుపల్లి మరియు ఇతర ప్రాంతాల్లో తక్కువ నీటి సరఫరా లేదా సరఫరాలో ఆలస్యం జరుగుతుంది.

కావున ప్రజలు గమనించి, తదనుగుణంగా నీటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నట్లు హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. సొంత ట్యాంక్ లేని ఆయా ప్రాంతాలలో ఉచిత నీటి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అందించడం జరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు పంప్ హౌస్ పునరుద్ధరణకు మరమ్మతులు కూడా చేపట్టారు.