ఐపీఎల్ 2021.. కోల్‌క‌తా ముందు 156 పరుగుల ల‌క్ష్యం - TNews Telugu

ఐపీఎల్ 2021.. కోల్‌క‌తా ముందు 156 పరుగుల ల‌క్ష్యంఐపీఎల్‌ 2021.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మెన్స్ చివర్లో చతికిలపడ్డారు. ఆరంభంలో ఓపెనర్లు అదరగొట్టినా.. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు.

ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిన ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేసింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ (33), డికాక్‌ (55) వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. రోహిత్‌ శర్మ ఔటయ్యాక.. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (5) విఫలమయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ (14), కృనాల్ పాండ్య (12) ఆకట్టుకోలేకపోయారు. కీరన్‌ పొలార్డ్‌ (21) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సునిల్‌ నరైన్ ఒక వికెట్‌ తీశారు.