ఐపీఎల్‌ 2021.. డివిలియర్స్ ధ‌నాధ‌న్‌.. ఢిల్లీ లక్ష్యం 172

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 171 చేసింది.

ఏబీ డివిలియర్స్ (75 నాటౌట్‌: 42 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ(12), దేవదత్‌ పడిక్కల్‌(17) ఆరంభంలో క్లీన్‌బౌల్డ్ అయి వెనుదిరిగారు. మాక్స్‌వెల్ (25: 20 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్సర్లు), రజత్‌ పటిదార్ (31: 22 బంతుల్లో 2సిక్సర్లు) రాణించడంతో బెంగ‌ళూరు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించింది.

5000 ప‌రుగుల క్ల‌బ్ లోకి ఏబీ

ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో 75 ర‌న్స్ చేసిన ఏబీ డివిలియర్స్.. ఐపీఎల్ లో 5000 ర‌న్స్ పూర్తి చేసిన రెండో బ్యాట్ మెన్ అయ్యాడు. అత‌ను 161 ఇన్నింగ్స్ లో ఈ ఘ‌న‌త సాధించాడు. ఏబీ కంటే ముందు డేవిడ్ వార్న‌ర్ 5 వేల ప‌రుగుల క్ల‌బ్ లో చేరాడు.