ఐపీఎల్‌ 2021.. టాస్‌ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి.

రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇక విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

ఢిల్లీ జ‌ట్టులో ఒక మార్పు జ‌ర‌గ‌గా.. ఆర్‌సీబీలో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మను వ‌చ్చాడ‌ని పంత్ చెప్పాడు. డేన్‌ క్రిస్టియన్‌ స్థానంలో డేనియల్‌ సామ్స్‌, సైనీ స్థానంలో రజత్‌ పటిదార్‌ తుదిజట్టులోకి తీసుకున్న‌ట్టు విరాట్‌ వెల్లడించాడు.