ఐపీఎల్‌ 2021.. రాహుల్‌ ధనాధన్‌.. బెంగళూరు టార్గెట్ 180

ఐపీఎల్‌ 2021 ఇవాళ మ్యాచ్ లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓవైపు వికెట్లు పడుతున్నా బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొని మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఆఖరి వరకు క్రీజులో నిలబడి 57 బంతుల్లో 91 (నాటౌట్) చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 7ఫోర్లు, 5సిక్సర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

హార్డ్‌హిట్టర్‌ క్రిస్‌గేల్ (46: 24 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరు మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కనీసం క్రీజులో నిలవలేకపోయారు.

బెంగళూరు బౌలర్లలో జేమీసన్‌ రెండు వికెట్లు తీయగా డేనియల్‌ సామ్స్‌, యుజువేంద్ర చాహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో వికెట్ పడగొట్టారు.