Home Slider News ఐపీఎల్ 2022.. రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ అవుట్..!

ఐపీఎల్ 2022.. రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ అవుట్..!

ipl

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ జాబితా బయటికొచ్చిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్‌ను రిటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

IPL 2021 ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గ్లెన్ మాక్స్ వెల్ IPL 2021లో 513 పరుగులతో ఈ సీజన్‌లో పరుగుల్లో 5వ స్థానంలో నిలిచాడు.

Royal-Challengers-Bangalore

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను రిటైన్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోనుందని వార్తలు విన్పిస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ వెస్టిండీస్ స్టార్‌లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లను రిటెన్షన్ చేసుకునే  అవకాశం ఉంది.

ఐపీఎల్ లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లకు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు నవంబర్ 30 వరకు సమయం ఉంది. ఈ జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్ల(ఇద్దరు విదేశీయులు)ను ఉంచుకోవడానికి అవకాశం ఉంది.

రెండు కొత్త ఫ్రాంచైజీలు – లక్నో, అహ్మదాబాద్ లు రిటెన్షన్‌లు ముగిసిన తర్వాత వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవచ్చని ఈఎస్పీఎన్ క్రిక్‎న్ఫో నివేదిక తెల్పింది. ఈ రెండు జట్ల కలయికలో ఇద్దరు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు ఉంటారు.