పశ్చిమ యూపీలో విపరీతమైన పొగ మంచు కారణంగా తేజస్ ఎక్స్ ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. నిబంధనల ప్రకారం ఐఆర్సీటీసీ ప్రయాణికులకు పరిహారం చెల్లించింది.
శుక్రవారం తేజస్ ఎక్స్ ప్రెస్ అలీగఢ్, గజియాబాద్ మధ్య ఏర్పడ్డ పొగమంచులో ఇరుక్కుపోయింది. దీంతో 12:25 నిమిషాల కల్లా ఢిల్లీకి చేరాల్సింది కాస్తా.. మధ్యాహ్నం 2:19 నిమిషాలకు చేరుకుంది. ఢిల్లీ నుంచి 4:59 నిమిషాలకు బయలు దేరాల్సి ఉండగా… గంట ఆలస్యంగా బయల్దేరింది.
ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణిస్తున్న ఈ ట్రైన్లో 544 ప్రయాణికులు ఉన్నారు. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం రైల్వే శాఖ వీరందరికీ 250 రూపాయల చొప్పున మొత్తం 1.36 లక్షల రూపాయలను పరిహారం చెల్లించింది.