మరో సంచలనం.. విడాకుల దిశగా బిగ్ బాస్ హిమజ.. అసలు ఆమె భర్త ఎవరో తెలుసా ?

Is Big Boss Himaja Break Up With Husbend
Is Big Boss Himaja Break Up With Husbend

గడిచిన మూడు నెలలుగా ఎప్పుడు లేనన్ని బ్రేకప్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల బంధాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. మొదట్లో ఇవన్నీ సోషల్ మీడియా గాసిప్స్ అన్ని కొట్టిపారేసినా.. వన్ ఫైన్ మార్నింగ్ ఈ రూమర్స్ అన్ని నిజమవుతూ వస్తున్నాయి. సమంత నాగ చైతన్యల విడాకులతో మొదలైన సెలబ్రెటీ బ్రేకప్స్ ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సామ్-చై తరువాత.. కళ్యాణ్ దేవ్-శ్రీజ, దీప్తి సునయన-షణ్ముఖ్, శ్రీహాన్-సిరి, ధనుష్-ఐశ్వర్య, తరుణ్ భాస్కర్-లతానాయుడుల వరకు విడాకుల వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా మరో సెలబ్రెటి వివాహ బంధం విడాకులకు దారి తీయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే డివోర్స్ రూమర్స్ అన్ని నిజమవుతున్న వేళా.. బిగ్ బాస్ ఫెమ్ హిమజ కూడా తన భర్తకి బ్రేకప్ చెప్పేయనుందా అని డౌట్స్ వస్తున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా సమంత ఏ ముహూర్తాన చైతుకి బ్రేకప్ చెప్పిందో కానీ.. వరుసగా పలువురు సెలబ్రెటీలు ఇన్ స్టాగ్రామ్ వేదికగానే తమ బంధాలకి ఎండ్ కార్డు వేసేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్‌గా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన హిమజ.. సినిమాల్లోనూ రాణిస్తుంది. శివం, నేను శైలజ, జనతా గ్యారేజ్, చిత్రలహరి, వినయవిధేయరామ, వరుడు కావాలెను ఇలా చాలా చిత్రల్లో రాణిస్తూ సిల్వర్ స్క్రీన్ పై పరుగులు పెడుతుంది. మొన్ననే ఖరీదైన కారుని కొన్న హిమజ తాజాగా ఒక విలాసవంతమైన నాలుగు అంతస్తుల ఇండిపెడెంట్ హౌస్ కూడా నిర్మించుకుంటున్నా.. అంటూ సోషల్ మీడియాలో శుభవార్తని పంచుకుంది. ఇంతలోనే భర్తతో హిమజ బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో రూమర్ ఒకటి వైరల్ అవుతుంది. అసలు బ్రేకప్ పక్కనపెడితే అసలు ఆమెకు పెళ్లి అయ్యిందా అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి.

అయితే 2012లో రాజేష్ ఆనందన్ అనే బిజినెస్‌మెన్‌ ని పెళ్లాడిన హిమజ కొన్ని కారణాలతో విడిపోయిందని గూగుల్ సమాచారం. వీరి విడాకులకు కారణం ఎవరు, ఏంటీ అని ఎవ్వరికి తెలియదు. అయితే రాజేష్ ఆనందన్ తో విడిపోయాక.. హిమజ చల్లా విజయ్ రెడ్డిని వివాహమాడింది. కానీ భర్తతో కాకుండా హిమజ పేరెంట్స్ తోనే చాలా రోజులుగా ఉంటున్నట్టు టాక్. నిజానికి హిమజతో విజయ్ రెడ్డికి రెండవ వివాహం. అంతకుముందే మరో అమ్మాయితో విజయ్ రెడ్డికి వివాహం అయినట్టు సమాచారం. ఇక ఇది ఎవరికి ఎన్నో పెళ్లి.. అన్న పర్సనల్ విషయాలు పక్కనపెడితే.. తాజాగా హిమజ-విజయ్ రెడ్డిలు ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే పుకార్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లో బ్రేకప్ కి ముందు సామ్ చై, దీప్తి షణ్ముఖ్ వంటి జంటలు అచ్చం ఇలానే ఒకర్నొకరు అన్ ఫాలో చేస్కుని అసలు విషయం తీరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఇలానే హిమజ బ్రేకప్ కూడా ఉండనుందా అని నెటిజన్స్ అనుమానిస్తున్నారు. అయితే ఇంతకీ ఈ విజయ్ రెడ్డి ఎవరు? పెళ్లి ఎప్పుడు అయ్యింది? హిమజతో పెళ్లి అయ్యిందా.. లేదా? అన్నదానిపై మాత్రం డౌటానుమానాలు చాలానే ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Himaja💫 (@itshimaja)