కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదేనా.. అలా రావడం దేనికి సంకేతం

దేవుడికిపూజ చేసినప్పుడు.. కొబ్బరికాయ కొట్టడం సంప్రదాయం. మనసులో ఉన్న కోరికలు తీర్చమని దేవుడికి దండం పెట్టుకొని దేవుడి ముందు కొబ్బరికాయ కొడుతారు. ఒకవేళ ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలామంది సంతోషంగా ఫీలవుతారు. దేవుడి కృప లభించిందని.. తాము కోరిన కోరిక తీరనుందని మురుస్తారు. అయితే.. అసలు కొబ్బరికాయలో పువ్వు వస్తే నిజంగా మంచిదేనా? అసలు అందులో పువ్వు ఎలా తయారవుతుంది? తెలుసుకుందామా..


కొబ్బరికాయలు అందరికీ తెలుసు. కానీ దాన్ని పగలకొడితే అందులో వచ్చే కొబ్బరి పువ్వులు మాత్రం కొందరికే తెలుసు. కొబ్బరి ఎంత రుచిగా ఉంటుందో.. కొబ్బరి పువ్వు అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో కోకోనట్ యాపిల్ అంటారు. ప్రకృతిలో ఏ పండైనా, ముందు పువ్వొచ్చి.. అది వాడిపోయాక దాని నుంచి కాయ వస్తుంది. కానీ కొబ్బరికాయ అలా కాదు. ముందు కొబ్బరిచెట్టుకు చిన్న పిలకలు వస్తాయి. వాటి నుంచి కొబ్బరికాయలు ఆ బోండాల్లో కొబ్బరికాయ వస్తుంది. కొబ్బరికాయ లోపల కొబ్బరిపువ్వు తయారవుతుంది.

లోపల పువ్వు ఎలా వస్తుంది?
కొబ్బరికాయలన్నింటిలోనూ కొబ్బరి పువ్వు రాదు. ఎందుకంటే… కొబ్బరి కాయ నుంచి కొబ్బరి మొక్క మొలకెత్తితేనే పువ్వు తయారవుతుంది. అందుకే మన పల్లెల్లో.. ఎండిపోయిన కొబ్బరిబోండాలను మట్టిలో పాతేస్తారు. వాటికి మొక్కల పిలకలు రాగానే… బయటకు తీసి… బోండాల్లోని కొబ్బరికాయల్ని వేరు చేస్తారు. ఆ కొబ్బరి కాయల్ని పగలగొడితే.. లోపల కొబ్బరిపువ్వులు ఉంటాయి.

రుచి ఎలా ఉంటుంది?
కొబ్బరి ఎంత గట్టిగా తియ్యగా ఉంటుందో.. కొబ్బరి పువ్వు కూడా అంతే తియ్యగా ఉంటుంది. కాకపోతే మెత్తగా, స్పాంజీలాగా ఉంటుంది. కొబ్బరికాయల్లో వచ్చినట్టే.. తాటిపండ్ల టెంకలలో కూడా పువ్వులు వస్తాయి. తేగల పిలకలు రాగానే టెంకలోపల పువ్వు తయారవుతుంది. అది కొబ్బరి పువ్వులాగే రుచిగా ఉంటుంది.

పువ్వు వస్తే శుభసంకేతమా?
కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదా.. కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే… అందులోపల పువ్వు వస్తుంది.అది చిన్న సైజులో ఉన్నా.. పెద్ద సైజులో ఉన్నా… పువ్వు వస్తే మాత్రం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు పండితులు. దేవుడికి సమర్పించిన కొబ్బరికాయలో పువ్వు రావడం శుభసూచకమట. మనసులో దేవుడిని కోరిక కోరికకు దేవుడి నుంచి వచ్చిన రిప్లై అని.. దాన్ని దైవ ప్రసాదంగా భావించాలని చెప్తున్నారు.