సమంత విడాకులకు.. షారుఖ్ ఖానే కారణమట.. అక్కినేని వారితో యుద్ధం కూడా అందుకేనట.. ఏంటీ సరికొత్త సంచలన వార్త..!

Is Shahrukh Khan Movie Main Reason For Samantha Divorce
Is Shahrukh Khan Movie Main Reason For Samantha Divorce
Is Shahrukh Khan Movie Main Reason For Samantha Divorce
Is Shahrukh Khan Movie Main Reason For Samantha Divorce

సమంత నాగచైతన్యల విడాకులు తీసుకుంటున్నట్టు ఎప్పుడైతే ఓపెనప్ అయ్యారో.. అప్పటి నుండి ఈ జంటపై రోజుకొక కొత్త వార్త పుట్టుకొస్తుంది. సమంతనే విడాకులకు ప్రధాన కారణం అంటూ విమర్శలు వచ్చాయి. ఎవరితోనో అఫైర్ ఉందని సమంతపై పుకార్లు వచ్చాయి. అయితే ముఖ్యంగా పిల్లలకి సామ్ టైం ఇవ్వటం లేదని,  ఫ్యామిలీ ప్లానింగ్ కారణంగానే విడిపోయారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పిల్లల విషయంలో సమంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుందని సామ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ముందుకొచ్చి వ్యాఖ్యానించారు. ఇందులో ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్, సింగర్ చిన్మయి వంటి వారు ఉండగా.. డైరెక్టర్ గుణశేఖర్ భార్య నీలిమ గుణ కూడా సమంతకి సపోర్ట్ గా నిలిచింది. ఇక తాజాగా సమంత పై ఇలాంటి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లల్ని కనాలనే ఆలోచనతో సామ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని సైతం త్యాగం చేసిందని మరో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.

అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లయన్ సినిమా కోసం మొదట సమంతనే సంప్రదించారట. ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచనలో ఉన్న సమంత సదరు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట. అనంతరం ఆ ఆఫర్ నయనతార వద్దకు వెళ్లిందని సమాచారం. ఇక దర్శకుడు అట్లీతో సామ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదట్లో ఈ ఆఫర్ ని వదులుకోవడం సమంతకి ఏ మాత్రం ఇష్టం లేదని కూడా తెలుస్తుంది. ఇక్కడే అక్కినేని ఫ్యామిలీతో సమంతకి విభేదాలు తారాస్థాయికి వచ్చాయని సోషల్ మీడియాలో కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనికి కారణం కూడా బలంగా చెప్తున్నారు. అట్లీ, షారుఖ్ ప్రాజెక్టు తో సామ్ బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని స్కెచ్ వేసుకుందట. ఇంతకు ముందు అట్లీ సమంత కాంబినేషన్ లో తేరీ, మెర్సల్ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరో హిట్ పడితే హ్యాట్రిక్ అయ్యేదని.. దానికి తోడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ కి జోడి అంటే.. హిందీలో కవరేజ్ భారీ స్థాయిలో ఉంటుందని.. ఇక ఈ లయన్ చిత్రం కానీ హిట్ అవుతే బాలీవుడ్ లో పర్మినెంట్ గా సెటిల్ అయిపోవచ్చని సమంత బలంగా భావించిందట. అయితే ఇదేకాని నిజమైతే కుటుంబానికి సమంత మరింత దూరమవుతుందని.. భార్య ముంబైలో, భర్త హైదరాబాద్ లో విడివిడిగా ఉండాల్సివస్తుందని.. అందుకే అక్కినేని ఫ్యామిలీ బలవంతం మెరకు.. ఇష్టం లేకపోయినా సామ్ ఈ ప్రాజెక్టు కి దూరమైందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.          ఈ షారుఖ్ ఖాన్ ప్రాజెక్టు దెగ్గరే సమంతకి, అక్కినేని కుటుంబానికి పూర్తిస్థాయిలో మనస్పర్థలు వచ్చాయని కూడా పుకార్లు షికార్లు కొడుతున్నాయి.