ఐసీసీ ర్యాంకింగ్స్.. టాప్‌ 10లో ఇషాన్‌ కిషన్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటిన వెటరన్‌ బ్యాటర్ దినేశ్‌ కార్తీక్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో దినేశ్‌ కార్తీక్ ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87 స్థానానికి చేరుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో అలరించిన ఇషాన్‌ కిషన్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 6 స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో యుజువేంద్ర చాహల్ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో ఉండగా.. ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌ జోస్‌ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టుల్లో ఆల్‌రౌండర్ల విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ కెప్టెన్‌ షకీబ్‌ హల్‌ హసన్‌, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్‌ విభాగంలో విరాట్ కోహ్లీ పదో స్థానంలో కొనసాగుతుండగా.. బౌలర్ల విభాగంలో అశ్విన్‌ రెండు, జస్ప్రీత్‌ బుమ్రా మూడో స్థానంలో ఉన్నారు.