ఇషాన్‌ జోరు మామూలుగా లేదు.. కొడితే బౌండరీయే

భారీ స్కోరు తేడాతో గెలిచే దిశగా ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్లు పక్కాప్లాన్ తో టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ గా బ్యాటింగుకు వచ్చిన ఇషాన్ కిషన్ రెండో బంతికే సిక్స్ కొట్టి తన దూకుడును ప్రారంభించాడు. కొడితే సిక్స్.. లేదంటే ఫోర్.. అనే రేంజ్ లో మైండ్ లో బ్లైండ్ గా ఫిక్సై బౌండరీలు బాదుతున్నాడు. 12 బంతుల్లోనే 34 పరుగులు చేసి.. జస్ట్ 3 ఓవర్లు పూర్తయ్యే సరికి 45 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.


భారీ రన్‌రేట్‌తో గెలిచే దిశగా.. ఇషాన్ ఆడుతున్న తీరుకు స్టేడియంలో ప్రేక్షకుల రెస్పాన్స్ మామూలుగా లేదు. జస్ట్ 16 బంతుల్లోనే ఇషాన్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్ జోరుకు సన్‌రైజర్స్‌ బౌలర్లు తల్లడిల్లుతున్నారు. ఎలాంటి బాల్ వేసిన.. నేరుగా బౌండరీకి పంపిస్తూ జట్టు స్కోరుబోర్డు వేగాన్ని ఓ రేంజ్ లో పెంచుతున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగితే.. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించడం ఖాయమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.