ఇజ్రాయెల్ పార్లమెంట్ మరోసారి రద్దు.. మూడేళ్లలో ఐదోసారి ఎన్నికలు

ఇజ్రాయెల్ లో రాజకీయ సంక్షోభం ముదిరింది. వివిధ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నఫ్తాలీ బెన్నెట్‌.. అతి తక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రెండు నెలలుగా పార్లమెంట్​లో మెజారిటీ లేకుండానే బెన్నెట్ అధికారంలో ఉన్నారు. తాజాగా నిర్వహించిన చర్చలు పార్లమెంట్ రద్దుకు కారణమయ్యాయి. కాగా మూడేళ్ల వ్యవధిలో ఐదోసారి ఎన్నికలు జరగడం గమనార్హం.

పాలనా వ్యవహారాలు, కొత్తగా ఎన్నికల తేదీలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్లమెంటును రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి 92 మంది చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. కేవలం తొమ్మిది మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ మరోసారి రద్దయ్యింది. నవంబర్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి.

12ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బెంజిమిన్ నెతన్యాహును గద్దె దించతూ.. గతేడాది జనవరిలో ఇజ్రాయెల్ ప్రధానిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ లాపిడ్‌ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగనున్నారు.