తమిళ సినిమా పరిశ్రమలోని పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్నుఎగవేతలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టింది. చెన్నై, మధురైలోని 40కి పైగా ప్రదేశాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
కలైపులి థాను, ఎస్ఆర్ ప్రభు, అన్బు చెగియాన్, జ్ఞాన్వేల్ రాజా సహా పది మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఆస్తులపై దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చెగియాన్ నివాసం, ఆయనకు చెందిన గోపురం సినిమా కార్యాలయంపై కూడా దాడులు సాగుతున్నాయి.