హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ బుధవారం నాడు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గన్ పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.