14వ ఉపరాష్ట్రప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్

Jagdeep Dhankhar

ఉపరాష్ట్రప‌తి ఎన్నికలలో ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్ ఎన్నికయ్యారు. ఇవాళ (శనివారం)  జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన‌ జ‌గదీప్ విజ‌యం సాధించారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వాపై ఆయ‌న 364 ఓట్ల తేడాతో గెలిచారు.

ఈ నెల 10న వెంక‌య్య నాయుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండ‌గా… మరుసటి రోజు 11న జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్ భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.