జీ20 సదస్సుకు వేదిక కానున్న జమ్ముకశ్మీర్

జీ20 దేశాలకు కశ్మీర్ వేదిక కానుంది. 2023 లో ఇండియా జీ20 సదస్సుకు అతిథ్యమివ్వనుంది. ఈ సమావేశాలను జమ్ముకశ్మీర్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం విశేషం. జీ 20 సభ్యదేశాల్లో ఒకటి ప్రతి ఏటా డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు జీ 20 అధ్యక్షత బాధ్యలు ఈ ఏడాది డిసెంబర్‌ 1న లభిస్తాయి. ఇందులో భాగంగా 2023 నవంబర్‌ 30 వరకు కూటమికి సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలను భారత్‌ నిర్వర్తిస్తుంది. జీ 20…1999, సెప్టెంబర్‌ 25న ఏర్పడింది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌ వ్యవస్థను కలిగిన దేశాల కూటమి.