మేకప్ ఆర్టిస్టుపై కోపంతో అరుస్తూ.. తన్నిన శ్రీదేవి కూతురు జాన్వీ.. అసలు జరిగిన గొడవేంటి ?

Janhvi Kapoor Imitates Bigg Boss Iconic Fight Between Pooja mishra And Shonali
Janhvi Kapoor Imitates Bigg Boss Iconic Fight Between Pooja mishra And Shonali

యావత్ దేశాన్ని తన నటనతో కట్టిపడేసిన దివంగత హీరోయిన్ శ్రీదేవి. సౌత్ టు నార్త్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి అకాల మరణం అందరిని కలిచివేసింది. టీనేజ్ లో ఉన్న ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటంటూ అందరు బాధపడ్డారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తల్లికి తగ్గ తనయగా రాణించే ప్రయత్నాలు చేస్తుంది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. మంచి కథ అంశాలున్నా సినిమాలను చేస్తూ పరిణితి చెందిన నటిగా బ్రాండ్ ఏర్పరుచుకుంటుంది. సోషల్ మీడియాలో అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకుండే క్రేజ్ ని సొంతం చేసుకుంది జాన్వీ. జిమ్ వర్కౌట్స్ వీడియోస్, ఫ్రెండ్స్ తో ఔటింగ్స్, హాట్ ఫోటోషూట్స్ కి సంబదించిన ప్రతి అప్డేట్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది జాన్వీ కపూర్.

ఇక సోషల్ మీడియాలో భారీగా ఉండే తన అభిమానుల కోసం జాన్వీ కపూర్ ఒక ఫన్నీ వీడియో చేసింది. తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్ తో కలిసి బిగ్ బాస్ 5 హిందీ కంటెస్టెంట్ పూజ మిష్రాని ఇమిటేట్ చేసింది. ఇటీవల హిందీ బిగ్ బాస్ లో షోనాలి నాగరాణి, పూజ మిశ్రా మధ్య జరిగిన గొడవ బీ టౌన్ లో సెన్సేషన్ అవుతుంది. దీంతో ఈ గొడవని ఇమిటేట్ చేస్తూ జాన్వీ కపూర్ చేసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో.. బిగ్ బాస్ పూజ మిశ్రాని ఇమిటేట్ చేస్తూ కోపంతో ఊగిపోతూ.. పక్కనున్న డబ్బాని గట్టిగ తంతే.. అది వెళ్లి అటువైపున్న తన మేకప్ ఆర్టిస్ట్ రివేరా లిన్ కి తగులుతుంది. దాంతో ఎందుకలా చేశావని షోనాలి నాగరాణి అడిగిన విధానంలో అడుగుతే.. అనుకోకుండా జరిగింది అంటూ జాన్వీ సమాధానం చెప్తుంది. ఇక నాకు సహాయం కావాలి అని క్యాప్షన్ పెట్టి ఈ వీడియోని సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ పోస్ట్ చేయగా అదికాస్తా తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)