‘నేష‌న‌ల్ స్టార్ట‌ప్ డే’గా జ‌న‌వ‌రి 16

National-Startup-Day

జ‌న‌వ‌రి 16ను ‘నేష‌న‌ల్ స్టార్ట‌ప్ డే’గా జ‌రుపుకోబోతున్నారు. ఈ మేరకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్రకటించారు. దేశంలోని 150 స్టార్ట‌ప్‌ల ప్ర‌తినిధుల‌తో ప్ర‌ధాని మోడీ ఇవాళ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు.

అగ్రిక‌ల్చ‌ర్‌, ఆరోగ్యం, ఎంట‌ర్‌ప్రైజ్ సిస్ట‌మ్స్‌, స్పేస్‌, ఇండ‌స్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్‌టెక్‌, ఎన్విరాన్‌మెంట్ త‌దిత‌ర రంగాల‌కు చెందిన స్టార్ట‌ప్‌ల ప్ర‌తినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్తయిన సంద‌ర్భంగా ఈసారి స్టార్ట‌ప్ ఇండియా ఇన్నోవేష‌న్ వీక్ నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. 2022లో స్టార్ట‌ప్‌ల రంగానికి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.