చిట్టి ఏంటీ ఇలా చేస్తోంది? సినిమా ఆఫర్ల కోసమేనా ఈ ప్రయత్నాలు - TNews Telugu

చిట్టి ఏంటీ ఇలా చేస్తోంది? సినిమా ఆఫర్ల కోసమేనా ఈ ప్రయత్నాలుచిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. అంటూ జాతిరత్నాలు సినిమాతో కుర్రకారు మనసు దోచిన ఫరియా అబ్దుల్లా.. తాజా ఫొటోలతో మతి పోగొడుతోంది. డఫెల్ బ్యాగీ ఫ్యాంటులో కొత్త లుక్ తో ఫొటోలకు ఫోజిచ్చింది. నల్ల డ్రెస్ తో… నల్ల గుర్రంతో రైడింగ్ సిద్ధం అంటోంది. ఈ హైదరాబాదీ నటి ఒకే ఒక్క సినిమాతో యూత్ లో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించింది. జాతిరత్నంలాంటి హీరోయిన్ గా కుర్రాళ్ల గుండెల్లో తిష్ఠ వేసుకుని కూచుంది. గత కొద్దిరోజులుగా ఇన్ స్టా వేదికగా దుమారం రేపుతున్న చిట్టి ఫరియా తాజాగా మరో హాట్ ఫోటోషూట్ ని షేర్ చేయగా వైరల్ అవుతోంది.

Jathi Ratnalu Fame Faria Abdullah Photos Gone Viral
Jathi Ratnalu Fame Faria Abdullah Photos Gone Viral

లూజ్ బ్యాగీపై వైట్ టాప్ ధరించి ఎంతో స్టైలిష్ గా జేబులో చేతులు పెట్టుకుని మరీ నిలుచున్న ఫొటోతో ఇన్ స్టా లో సెగలు పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ లో డిజైనర్ ఫ్రాకు ధరించి గుర్రం మూపురంపై చేతిని ఉంచి స్టైలిష్ గా దిగిన మరో ఫొటో అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఫరియాకు మంచు కాంపౌండ్ నుంచి క్రేజీ ఆఫర్ దక్కింది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న ఢీ సీక్వెల్ కోసం ఫరియా అబ్దుల్లాను సెలక్ట్ చేశారట. విష్ణు స్వయంగా రంగంలోకి దిగి ఈ టవర్ బ్యూటీని ఒప్పించారట. ఆచితూచి అడుగులు వేస్తున్న ఫరియా తెలివైన ఎంపికలతో కెరీర్ ని సాగించాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం తన డ్యాన్సింగ్, యాక్టింగ్ స్కిల్స్ కి మరింత పదును పెడుతూనే.. వరుసగా కథలు వింటోంది.