‘జాతిరత్నాలు’ బంపర్ కలెక్షన్లు

అనుదీప్ కేవీ డైరెక్షన్లో వచ్చిన జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. రూ.12 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు బయ్యర్లకు లాభాల పంట పండిస్తుందిప్పుడు. వీకెండ్ లోనే 20 కోట్ల షేర్ వసూలు చేసి దూసకుపోతుంది. ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్లతో దుమ్మురేపడం ఖాయంగా కన్పిస్తోంది.

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో నటించి తమ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నరు. యూట్యూబర్‌గా అందరికి పరిచయమైన ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులను కొట్టేసింది.

ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ వసూళ్లు

నైజాం – 7.07 కోట్లు, సీడెడ్ – 2.8 కోట్లు, ఉత్తరాంధ్ర – 2.31 కోట్లు, నెల్లూరు – 59 లక్షలు, కృష్ణ – 1.07 కోట్లు, గుంటూరు – 1.31 కోట్లు, వైజాగ్ – 96 లక్షలు, ఈస్ట్ – 97 లక్షలు , వెస్ట్ – 97 లక్షలు, రెస్టాఫ్ ఇండియా – 61 లక్షలు, ఓవర్సీస్ – 3.31 కోట్లు