ప్రభాస్ తో ఫన్నీగా సాగిన ‘జాతిరత్నాలు’ ట్రైలర్ రిలీజ్

న‌వీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ‘జాతిరత్నాలు’ సినిమా ట్రైలర్ రిలీజ్ వినూత్నంగా జరిగింది. ‘జాతిరత్నాలు’ సినిమాకు అనుదీప్ కేవీ డైరెక్ష‌న్‌ వహిస్తుండగా.. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామకృష్ణ కీ రోల్స్ పోషిస్తున్నరు. తాజాగా జాతిర‌త్నాలు ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్ర‌భాస్ లాంఛ్ చేశాడు. అయితే, ఇది చాలా ఫన్నీగా ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకను నిర్వహించడం ఇక్కడ విశేషం.

ప్రస్తుతం ముంబైలో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ను కలిసేందుకు జాతిరత్నాలు టీం వెళ్లింది. న‌వీన్‌-ప్రియ‌ద‌ర్శి ముంబైలోని ప్ర‌భాస్ ఇంటి ప్రాంగ‌ణంలోకి వెళ్లగా.. సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడం.. ఆపై ప్రభాస్ ప్లాట్ లోకి ఎంటర్ కావడం..అక్కడ వాళ్లు చేసే నానా హంగామా మొత్తాన్ని వీడియో తీసి ప్రేక్షకుల కోసం విడుదల చేశారు.

అంత పెద్ద హీరో ప్రభాస్ సైతం ఎక్కడా తగ్గలేదు. డైరెక్ట‌ర్ అనుదీప్, న‌వీన్‌, ప్రియ‌ద‌ర్శి లతో కలిసి సందడి చేశాడు. ‘జాతిరత్నాలు చాలా ఫన్నీగా ఉందని, సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.’ అని ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అన్నాడు.  ఈ వీడియోని ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.